తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే.