తిరుపతి జిల్లా, తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ అలజడి రేపింది. కొత్తపాళెం లే అవుట్లోని ఓ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి బీరువాలో దాచిన నగలు, నగదుతో పరారయ్యారు.
బినియన్లు, చెడ్డీ ధరించి మారణాయుదాలతో ముగ్గురు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.