వెస్టిండీస్ లో జరిగే T20 ప్రపంచకప్ ను ఉగ్రదాడి భయం వెంటాడుతోంది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఈ మేరకు హెచ్చరికలు చేయడమే దీని కారణం.

అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చాయి. కాగా.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ తమ దేశంలో నిర్వహించాలని భావిస్తోంది. తాజా ఉగ్ర హెచ్చరికల దృష్ట్యా అది కష్టమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.