గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల మంటకు కారణమయ్యే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయం చేస్తుంది. స్పైసీ ఫుడ్ ఎండార్ఫిన్లు విడుదలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా మానసిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది.