ఐఐటీ-భువనేశ్వర్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.

కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన కృతికా రాజ్ గా గుర్తించామన్నారు. విద్యార్థిని మృతిని ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.