రాష్ట్రంలో రేపటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 9.80 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు టెలిమానస్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని, ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.