ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి పోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. మనం పాటించే పద్దతుల కారణంగా కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది.

రాత్రి పూట కొన్ని అలవాట్లను పాటిస్తే.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం కూడా కొలెస్ట్రాల్‌ లెవల్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రి పూట చాలా మంది తెలీక ఎక్కువ తినేస్తూ ఉంటారు.

ఇలా తినడం వల్ల.. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక నిల్వ ఉండిపోతుంది. దీంతో అది మెల్లగా కొవ్వుగా మారిపోతుంది. రాత్రి పూట వీలైనంత వరకూ తక్కువ తినాలి. అది కూడా త్వరగా అరిగిపోయేలా ఉండాలి.

రాత్రి పడుకునే ముందు ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, కొవ్వు నిల్వ ఉన్న ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా శాతం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచేస్తాయి.

రాత్రి పడుకునే ముందు.. చక్కెర ఉన్న ఆహార పదార్థాలు అంటే ప్యాక్ చేసిన పండ్ల రసాలు.. కూడా తీసుకోకూడదు. వీటిని తిన్నా కూడా కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. రాత్రి పూట మీ డిన్నర్‌లో పండ్లు, పాలు, నట్స్ ఉండేలా చూసుకోండి.