42 లక్షలకుపై పెళ్లిళ్లు.. రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం
ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఇందులో ఒక్క ఢిల్లీలోనే 4 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగనున్నాయట. ఈ నేపథ్యంలో రూ.5.5లక్షల కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెళ్లిళ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సృష్టిస్తుందని చెబుతున్నారు.