జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఐక్యరాజ్య సమితి(UNO) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని తెలిపింది.
మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇక బంగ్లాలో హిందువులపై దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ డిమాండు చేసింది.