శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు మరింత వేగంగా పొందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా భక్తులకి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఇందుకు ప్రసాదం కౌంటర్ లోని కంప్యూటర్ తో ఆధార్ వివరాలు నమోదు చేస్తున్నారు.
ఈ నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ఐటీ విభాగం ఆధార్ కార్డ్ స్కానింగ్ యాంత్రాలను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. 6 కౌంటర్ లలో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.