తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలుశిక్షతో పాటు రూ.5.88లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది.
తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు పెండింగ్ లో ఉండగా, నిందితుడు 4ఏళ్లు జైల్లో ఉన్నాడు. తాజాగా ఆ బాలిక తన వాంగ్మూలం తప్పని కోర్టులో అంగీకరించడంతో ఆమె తల్లికి కోర్టు జైలుశిక్ష విధించింది.