మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడారి పోతుంది.

అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.