పంజాబ్, హరియాణా బార్డర్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఇంటర్నెట్ నిలిపివేయడం, సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేయడంపై రైతులు పంజాబ్-హరియాణా హైకోర్టులో పిటిషన్ వేశారు. కాసేపట్లో ఇది విచారణకు రానుంది.