యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది.
అయితే పెళ్లిరోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు మెహతాబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.