సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం 10 వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు 23న మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.