పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. బీజేపీని ప్రజలు ‘ప్రజాస్వామ్యానికి ముప్పు’గా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడంతో పాటు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయన్నారు. బీజేపీ మత ప్రచారం కూడా ఆ పార్టీకి చేటు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.