తమ దేశంలో పర్యటించాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత ప్రధాని మోదీని కోరారు. తన ఆహ్వానాన్ని భారత పీఎంకు తెలపాలని నేపాల్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి సూచించారు.
ప్రచండ హయాంలోని గత సర్కారు ఆ దేశ చట్టసభల్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ఓలీ గత నెలలో నాలుగో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.