రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.
దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. నారింజలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ తింటే బరువు తగ్గవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తుంది. నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.