కేటీఆర్ పై కేసు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. “ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు.

కేటీఆర్ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసు నిజమే అయితే.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.