రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ తెలిపింది.
బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11 – అక్టోబరు 6 మధ్య ఉండాలి.