నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్స్ సర్టిఫికేషన్ ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము వ్యవహరించలేమని తెలిపింది. సెప్టెంబర్ 18లోపు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.