తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మార్చి 4న తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

5 పార్లమెంట్ క్లస్టర్లలో బీజేపీ యాత్రలు ముగించుకుని హైదరాబాద్కు రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు.