బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ఆ దేశ ప్రభుత్వం మరో 4 మర్డర్ కేసులు నమోదు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఇప్పటికే ఆమెపై 55 కేసులను ఆ దేశ సర్కార్ పెట్టగా.. అందులో 44 మర్డర్ కేసులు ఉండటం గమనార్హం. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక సంఘటనలలో బంగ్లాదేశ్ లో 230 మందికి పైగా మరణించారు.