రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరునెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289కోట్ల GST ఎగవేతలు, మోసాలు జరిగినట్లు తేలింది.

ఇందులో రాష్ట్ర GST పద్దు కింద రూ. 923కోట్లు, కేంద్ర GST కింద రూ. 919కోట్లు, IGST కింద రూ. 447కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎగవేతదారుల నుంచి ఇప్పటివరకూ రూ.167కోట్లు వసూలు చేసినట్లు వాణిజ్య పన్నులశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.