బ్రూనై పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.