రాష్ట్రంలో 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. నవంబరు నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాల్సి ఉంది.

అయితే అంతకన్నా ముందే రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. తొలుత అన్ని ప్రభుత్వశాఖల నుంచి బడ్జెట్ తయారీకి సంబంధించి ప్రాథమిక స్థాయిలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆర్థికమంత్రి పయ్యావుల అన్ని ప్రభుత్వశాఖల మంత్రులతోనూ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు.