భూమిలేని రైతు కూలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.

ఈ సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భూమిలేని పేదలు కొన్నిసార్లు కూలీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు భరోసా కూడా పకడ్బందీగా అమలు చేసి అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.