జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లోక్సభ స్థానంలో రాత్రి వరకు 37.98శాతం పోలింగ్ నమోదైంది. 35 ఏళ్లలో ఇదే గరిష్ఠమని అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల నుంచి వచ్చిన స్పందనకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో 14 శాతమే ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత శ్రీనగర్లో తొలి ఎన్నిక ఇదే కావడం గమనార్హం.