మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలగని జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సుయాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు ఊహించలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తా అంటున్నదని విమర్శించారు. జగిత్యాల జిల్లా ఉండాలా? పోవాలా? అని కేసీఆర్ ప్రజలను అడిగారు.