రైల్వే స్టేషన్లలో టికెట్ల కొనుగోలు విషయంలో… నగదు, చిల్లర సమస్యలకు చెల్లుచీటీ పడనుంది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కీలక ముందడుగు వేసింది.
జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రధానస్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తోంది.