Month: March 2024

రికార్డు స్థాయికి మారుతి సుజుకీ షేర్లు!

వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ షేర్లు ఈరోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 3శాతం మేర పెరిగిన షేర్ విలువ తొలిసారిగా ఈరోజు రూ.12వేల మార్కును టచ్ చేసింది. మధ్యాహ్నం 12.44 గంటల సమయానికి షేర్ వాల్యూ 3.14 శాతం పెరిగింది.…

నేను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు పై చర్యలు: ట్రంప్

తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు హ్యారీపై చర్యలు తీసుకుంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2020 నుంచి అమెరికాలో ఉంటున్న హ్యారీ, గతంలో డ్రగ్స్ వాడినట్లు ఓ పుస్తకంలో వెల్లడించారు. అమెరికా వీసాకు అప్లై చేసినప్పుడు…

TG : ఒంటరిగానే బరిలోకి దిగుతాం – సీపీఎం

లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

AP : కాంగ్రెస్ లో చేరిన మాజీ MLA పరిగెల మురళీకృష్ణ

ఎన్నికల వేళ కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు MLA ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ MLA పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.…

మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్న తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను…

తెలియని వారి పెళ్లిళ్లకు వెళ్లి పట్టుబడితే ఇక అంతే…

నోరూరించే వంటకాలను లాగించేయొచ్చని కొంతమంది తెలియని వారి పెళ్లి వేడుకల్లోకి చొరబడిపోతుంటారు. కడుపారా అన్ని ఐటమ్స్ లాగించి కామ్ గా బయటకొస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ పట్టుబడితే? కొందరైతే మందలించి వదిలేస్తారు లేదంటే.. మీ మీద కేసు నమోదయ్యే…

వడదెబ్బ లక్షణాలు…

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడారి పోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు…

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ గవర్నర్ పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

AP : ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలు/ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్య కలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా చర్యలు తప్పవంది. ప్రభుత్వం కొత్త…

క్యాంపస్ సెలక్షన్లలో అమ్మాయిలదే జోరు!

క్యాంపస్ సెలక్షన్లలో గత ఏడాది అమ్మాయిలదే హవా సాగినట్లు హైరై సంస్థ వెల్లడించింది. సెలక్ట్ అయిన ప్రతీ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అమ్మాయి ఉందని తెలిపింది. 2023లో సంస్థలు ఎంపిక చేసిన ఫ్రెషర్లలో 40% మంది అమ్మాయిలే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు…

TS : నిజామాబాద్ లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన పసుపు…

పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ లో క్వింటాల్ పసుపు ధర గరిష్ఠంగా రూ. 18,299 పలికింది. పెర్కిట్ కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతు పంటకు ఈ ధర లభించగా.. ఇటీవల పెరుగుతున్న ధరలతో…

AP : ఈ రోజు మత్స్యకారులకు పరిహారం అందజేయనున్న సీఎం జగన్

నేడు సీఎం జగన్ నెల్లూరు జిల్లా బోగోలు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించనున్నారు. రూ.289 కోట్లతో నిర్మించిన ఈ హార్బర్ను ఆయన వర్చువల్ ప్రారంభిస్తారు. మరోవైపు ఓఎన్జసీ పైప్లాన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందించనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల…

TS : ఇందిరమ్మ ఇళ్ల పథకం… ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000.. వీరికే ◼️దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. ◼️లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. ◼️ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక…

TS : కరీంనగర్ వేదికగా నేడు కదనభేరి సభ

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపనుంది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ వేదికగా నేడు కదనభేరి సభను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని…

ఈ నెల 14న ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ భేటీ

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల ఎంపికకు ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ ఈ నెల 14న భేటీ కానుంది. ఈసీ అరుణ్ గోయెల్ ఇటీవల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో ఈసీ అనూప్ చంద్ర పాండే పదవీ…

డిజిటల్ ప్రచార రథాలను ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్ లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ప్రచార డిజిటల్ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారి…

AP : ఎల్లుండి నుంచి లోకేశ్ ‘శంఖారావం’ సభలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మార్చి 3 నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. 3, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు పార్లమెంటు పరిధిలోని సభల్లో పాల్గొంటారు. 7న సర్వేపల్లి, గూడూరు,…

1993లో రైళ్లలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఉగ్రవాది కరీం తుండా నిర్దోషి: టాడా కోర్టు తీర్పు

1993లో రైళ్లలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ టాడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు…

TS : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త… ఇంటర్ పరీక్షల్లో…

ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనపై విమర్శలు రావడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నిన్న ఆదిలాబాద్ గురుకుల కాలేజీ, HYDలో…

2018తో పోలిస్తే చిరుతల సంఖ్య గణనీయంగా పెరుగుదల… ఏంటంటే…

భారత్ లో 2018తో పోలిస్తే చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. 18 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే రిపోర్టును కేంద్రం తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,874 చిరుతలు ఉండగా, అత్య ధికంగా మధ్య ప్రదేశ్లో 3907 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 1985,…

AP : వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతమంతా వారి కోసమే

వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతమంతా వాలంటీర్ల కోసమే ఖర్చు చేస్తానని దర్శి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదొడ్డి వెల్లడించారు. అలాగే తమ ట్రస్టు ద్వారా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. వాలంటీర్ పరిధిలో ఉండే…